
దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామా మూడో సీజన్ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా దర్శకుడు రాజ్ నిడిమోరు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి..
ఈ సిరీస్‌లో సమంత, నిమ్రత్ కౌర్‌ల నటన గురించి ఆయన మాట్లాడుతూ, “ఈ సిరీస్ కోసం మేము రాసిన పాత్రలు మొదట ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. సమంత అయినా, నిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. నిజానికి వారి పాత్రలు చేయడం చాలా తేలిక. అయినప్పటికీ వాళ్లు ఎంతో కష్టపడి ఆ పాత్రల్లో జీవించారు” అని పేర్కొన్నారు. అదే సమయంలో, నటీనటుల విషయంలో తాను లింగ భేదాలు చూడనని స్పష్టం చేశారు..!!

