
రాఘవేంద్ర రావు గారు మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, కమర్షియల్ గ అయన చిత్రాలు ఎనభై శాతం విజయవంతమయిన సినిమాలే. ముఖ్యంగా వారి చిత్రాల్లో పాటలలో హీరోయిన్ల అందాల ఆరబోత, బొడ్డు మీద పూలు, పళ్ళు వేయడం ఆనవాయితీ, వాటిని ఆడియన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేసారు.అప్పటి హీరోయిన్ లు అందరు ఆయన చిత్రాల్లో నటించటానికి ఉత్సాహం చూపే వారు, కానీ అదే ధోరణి ,ఒక ప్రముఖ హిందీ హీరోయిన్ ఆయన చిత్రం లో నటించను అని నిరాకరించటానికి కారణం అయింది. ప్రముఖ నిర్మాత మురారి గారు నిర్మించిన త్రిశూలం అనే సినిమా కు రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్, ఆ చిత్రం లో జయసుధ గారు నటించిన పాత్ర కోసం, ప్రముఖ హిందీ నటి స్మిత పాటిల్ గారిని మురారి గారు అడిగారు, కథ విన్న స్మిత పాటిల్ గారు, ఆ పాత్ర పోషించటానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత డైరెక్టర్ ఎవరు అని అడగటం, రాఘవేంద్ర రావు గారు అని తెలిసిన వెంటనే ఆ పాత్ర చేయటానికి నిరాకరించారు. రాఘవేంద్ర రావు గారు హీరోయిన్స్ ను తెరపై చూపించే విధానం నచ్చకపోవటం వలనే ఆవిడ ఆ పాత్ర నిరాకరించారు అని ఆనాటి సినీ జర్నలిస్టుల భోగట్టా. స్మిత పాటిల్ వంటి నటికి అయన ధోరణి నచ్చకపోయినా, అయన అనుసరించిన ఆ పాటల చిత్రికరణే ఆయనను ఒక ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టింది. రాజు మెచ్చిందే రంభ అన్నట్లు, ప్రేక్షకుడు మెచ్చిందే బొమ్మ (సినిమా) అనటానికి ఇదొక నిదర్శనం గ చెప్పవ.

