in

Raashii Khanna joins Ustaad Bhagat Singh as shloka!

రీష్ శంకర్ దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా శ్రీలీల‌ న‌టిస్తున్నారు. అయితే, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ లో తాజాగా రాశీ ఖ‌న్నా జాయిన్ అయిన‌ట్లు మేకర్స్ ధ్రువీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ సోష‌ల్ మీడియాలో ఆమె షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్లు ఒక పోస్టు పెట్టారు. ఇందులో ఆమె  ‘శ్లోక’ అనే పాత్రలో న‌టిస్తున్నార‌ని, ఆమెకు స్వాగతం అంటూ పోస్టు పెట్టారు.

కథాంశానికి కొత్తదనాన్ని తెచ్చే బలమైన, కీలకమైన పాత్రగా మేక‌ర్స్ పేర్కొన్నారు. ఈ మూవీలో రాశి ఖన్నా శ్లోక అనే పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని స‌మాచారం. హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు..!!

devara to peddi, jhanvi kapoor hikes her pay!