
సెలబ్రిటీలు సాధారణంగా వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకుంటారు. కానీ మీడియా, ఫ్యాన్స్ వల్ల వారి పర్సనల్ లైఫ్ ఎంత సీక్రెట్‌గా ఉంచుదామనుకున్నా అది కుదరదు. ఈ నేపథ్యంలో యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా తన లైఫ్‌లోని ఒక సీక్రెట్‌ను బయటపెట్టింది. తాజాగా ఈ భామ లాక్ డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమై ఓ వెబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా ఆమె తన తొలి డేటింగ్ విశేషాలను బయటపెట్టింది. తన తొలి ప్రేమ అనుభూతులను పంచుకున్న ఆమె అది డేటింగ్ అన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పింది. తనకు 16 ఏళ్ళ వయసున్నప్పుడు తొలిసారిగా డేట్‌కు వెళ్లిందట రాశీఖన్నా. “నా ఫ్రెండ్ నన్ను డేటింగ్‌కు పిలిచాడు. అప్పట్లో అది డేట్ అని కూడా నాకు తెలియదు. నా పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తానని చెప్పి ఆ కుర్రాడు నన్ను బయటకు తీసుకెళ్లాడు. ఇంటి దగ్గరలోనే ఉన్న మెక్ డోనాల్డ్‌కు రమ్మనటంతో దగ్గరే అన్న ఉద్దేశంతో నేను వెళ్లాను. అయితే ఆ సమయంలో నేను బాగా ఆకలితో ఉండటంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి అన్నీ తినేశాను. కానీ నేను తింటున్నంత సేపు ఆ కుర్రాడు నన్ను పొగుడుతూనే ఉన్నాడు. బిల్లు కూడా అతనే కట్టాడు”అని చెబుతూ ఆవిధంగా ఫస్ట్ డేట్ 16 ఏళ్ల వయసులోనే ముగిసిందని రాశీ ఖన్నా పేర్కొంది. అయితే అదే తన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ అదే అని కూడా చెప్పింది ఈ యంగ్ బ్యూటీ.

