ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు..అయితే కోలీవుడ్‌లో మాత్రం వరుస ప్రాజెక్ట్స్‌ను చేస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ అమ్మడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు. స్వయంగా రాశీ ఖన్నానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేడని..అనుకోకుండా యాక్ట్రెస్ అయ్యానని చెప్పుకొచ్చిన రాశీ..
ఎలాగో తాను ఐఏఎస్ ఆఫీసర్ ను కాలేను కానీ ఫ్యూచర్ లో మాత్రం పక్కా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తెలిపింది. అలాగే కుదురితే ఒక ఎన్జీవో కూడా ప్రారంభించి.. ప్రజలకు అండగా ఉంటానని అంటోంది రాశీ. ఇక పాలిటిక్స్ లో జాయిన్ అవుతాని కానీ పాలిటిక్స్ చేయడం తనకు రాదని.. ప్రజాసేవే తనకు తెలుసని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి త్వరలోనే తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని రాశీ చెప్పకనే చెప్పింది. మరి ఇంతకీ రాశీ ఏ పార్టీలో చేరుతుందో చూడాలి.