in

raashi khanna shares emotional note on ‘Telusu Kada’!

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు..

“కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని కథలు గుర్తుండిపోతాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథే. ఈ సినిమా ప్రయాణం నాకు ఎంతో ప్రత్యేకం. ఈ జర్నీలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని రాశి ఖన్నా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది..!!

Kajal Aggarwal responds to road accident death news!

tollywood beauty Meenakshi Chaudhary eyes on Bollywood!