హీరో మాధవన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో మాధవన్ మాట్లాడుతూ పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ సీన్లు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. వయసుకు తగిన పాత్రలు చేయడం నాకు ఇష్టం. సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ ల మధ్య ప్రేమ సినిమాలతో పాటు రొమాన్స్ సన్నివేశాలు తెరకెక్కించడంలో ఇండస్ట్రీలో మార్పు వచ్చింది..
సీనియర్ హీరోలు యువకుల్లా నటిస్తూ హీరోయిన్స్ వెంటపడి తెరకెక్కించే సినిమాలు ఇప్పుడు రావడం లేదు. అలాంటి కథలను ఏ హీరో కూడా చేయడం లేదు. అటువంటి సినిమాలను ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. నేను కూడా 40 ఏళ్ళ వయసులో కాలేజీ కుర్రాడిగా 3 ఇడియట్స్ సినిమాలో నటించాను. ఆ పాత్ర నాకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ కనిపించదు. వయసుకు తగ్గట్టుగా మాత్రమే పాత్రులను ఎంచుకోవాలి..!!