యువ హీరో రాజ్ తరుణ్ 52 షార్ట్ ఫిలిమ్స్ చేసి, డైరెక్టర్ అవ్వాలనుకొని సినీ పరిశ్రమ కు వచ్చి నటుడు గ స్థిరపడ్డారు , ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ వారి చిన్న తనం లో రాజ్ తరుణ్ చేసిన కొన్ని సాహసాలు చెప్పాలి అనే కుతూహలం తో ఈ విషయాలు తెలియ చేస్తున్నాము. ఫోర్ ఇయర్స్ ఏజ్ లోనే రాజ్ తరుణ్ రోడ్ సైడ్ రోమియో అని మోనో యాక్షన్ లో ఉల్లిపాయలు దండగ మేడలో వేసుకొని, బిల్ గేట్స్ కు ఫోన్ చేసి మీ కంప్యూటర్స్ కంటే ఉల్లిపాయల వ్యాపారమే లాభదాయకం గ ఉంది ఉంటూ నవ్వులు పూయించారు.
అప్పట్లో ఉల్లిపాయల ధరలు విపరీతం గ పెరగటం తో ఈ స్కిట్ చేసారు. తరువాత స్టేజి మీద కొన్ని మేజిక్ షో లు కూడా చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వీటన్నిటికంటే ఇంట్రెస్టిం థింగ్ ఇంకొకటి ఉంది అదేమిటంటే, అంత చిన్న వయసులో విశాఖ రోడ్స్ మీద బ్లైండ్ ఫోల్డ్ సైక్లింగ్ చేసి నేషనల్ రికార్డు కూడా క్రియేట్ చేసారు. రియల్లీ హి ఇస్ ఏ వండర్ కిడ్ కదూ! స్టేజి ఫియర్ అంటే ఏమిటో తెలియదు కాబట్టే, స్క్రీన్ మీద కూడా తనకు వచ్చిన రోల్స్ ని అలవోక గ చేసి మంచి ఈజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఇదేనేమో.