ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది పుష్ప టీమ్. ఈ సాంగ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ సమంత. టాలీవుడ్ లో తొలిసారిగా ఓ ఐటమ్ సాంగ్ చేసిందీ భామ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒకవైపు.. లెక్కల మాస్టర్ సుకుమార్ టేకింగ్ మరోవైపు.. ఈ రెండు అంశాలు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోతుంటే.. ఇప్పుడు సమంత స్పెషల్ సాంగ్ పుష్ప క్రేజ్ ని పీక్స్ కి తీసుకెళ్లేలా ఉంది.
ఊఅంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అంటూ మాస్ ఆడియన్స్కి చెమటలు పట్టించేలా పాడి.. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సింగర్ ఇంద్రావతి చౌహన్. ఈ స్పెషల్ సాంగ్ విడుదలైన 24గంటల్లోనే 13మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి.. ఒకవైపు టాలీవుడ్ లో సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంటే.. మరోవైపు ఈ సాంగ్ కాపీ ట్యూన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. “ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ సాంగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందని నెటిజన్లు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కామెంట్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ అచ్చం సూర్య హీరోగా నటించిన “వీడొక్కడే” సినిమాలోని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ కంపోజ్ చేసిన ‘హానీ.. హానీ’ పాటలా ఉందని అంటున్నారు. దీనికి సాక్ష్యంగా యూట్యూబ్ లో వీడియోలు వదులుతున్నారు. ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ దేవి కాపీ కొట్టాడంటారా లేదా అంటే రెండు పాటలు విని నెటిజన్స్ డిసైడ్ చేయాలి.