పుష్ప 2 క్లాస్ మూవీ కాదు, ఫారెన్ లొకేషన్స్ లో తీసింది కాదు. ఊర మాస్ మూవీ, హీరోని కూడా స్టైల్ గా అందంగా చూపించలేదు అయినా హీరోయిజం అంటే ఇది కదా అని నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 100 ఏళ్ళ బాలీవుడ్ సినీ చరిత్రలో వేల సినిమాలు వచ్చాయి. కానీ అక్కడ ఎప్పుడూ ఖాన్ లు, కపూర్లు రాజ్యమేలుతున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్స్ కూడా బాలీవుడ్ హీరోలే. అలాంటి చరిత్రను తిరగరేసాడు అల్లు అర్జున్.
నార్త్ లో ‘పుష్ప 2’ కేవలం 15 రోజుల్లోనే 632.50 కోట్లు కలక్ట్ చేసింది. దీనితో బాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా పుష్ప 2 రికార్డ్ సృష్టించింది. ఒక్క ముంబైలోనే 200 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మూవీగా కూడా నిలిచింది. పుష్ప 2 కి ముందు ‘స్త్రీ 2’ మూవీ 627 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఈరికార్డ్ ని ‘పుష్ప 2’ 15 రోజుల్లోనే బ్రేక్ చేసింది. ఇండియాలోనే 14 రోజుల్లో 1500 కోట్ల గ్రాస్ కలక్ట్ చేసిన సినిమాగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. దటీజ్ పుష్ప రాజ్ బ్రాండ్..!!