
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ గారి ప్రొడక్షన్ హౌస్ పేరు వైష్ణో మూవీస్, అలాగే వారి ఆఫీస్ బిల్డింగ్ కి కూడా ఒక పేరు పెట్టారు అదేంటో తెలుసా? ” కేవ్ ” అంటే” గృహ” అని సహజం గ గృహాలు కొండల్లో, అడవుల్లో ఉంటాయి కానీ నగరం నడిబొడ్డున, ఈ కేవ్ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా? పూరి గారు గురువు అయిన రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచారు ఆఫీస్ ఓపెనినింగ్ ఫంక్షన్ కి, వచ్చిన వర్మ గారు దీనికి ఒక పేరు పెట్టు అన్నారట, దానికి జవాబు గ పూరి గారు వెంటనే, నోమాడ్ (సంచార జీవి) అని సూచించారు, ఆ పేరు వెనుక ఎంతో వేదాంత ధోరణి ఉంది, ఇక్కడ ఎంత కాలం ఉంటామో తెలియదు, అనే ఆలోచన. కానీ రాము గారు ఆబ్బె పేరేమి బాగోలేదు, అని” కేవ్ “అని నామకరణం చేసి, కేవ్ అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా “అల్ ది కేవ్స్ అర్ ఆకుపైడ్ బై టైగెర్స్” అన్నారట. అంటే పులులు మాత్రమే గృహాలలో నివసిస్తాయి అని అర్ధం. తన శిష్యుడు పూరి, ఇండస్ట్రీ లో పులి లాగా బ్రతకాలి అనే ఉద్దేశం తో ఆ పేరు పెట్టి ఉంటారు రాము గారు. అందుకే ఏమో అయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఆ కేవ్ కె వెళ్లిపోతుంటారు.

