టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి-నిర్మాత ఛార్మీ కౌర్ మధ్య ఉన్న బంధంపై సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వస్తున్న పుకార్లకు ఆయన మరోసారి తనదైన శైలిలో ముగింపు పలికే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహబంధమేనని, రొమాంటిక్ సంబంధం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఈ విషయంపై ఇటీవల స్పందించిన పూరీ జగన్నాథ్, “ఛార్మీ నాకు తన 13వ ఏట నుంచే తెలుసు. గత 20 సంవత్సరాలుగా మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. కలిసి ఎన్నో సినిమాలకు పనిచేశాం. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ వ్యవహారం లేదు” అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో యువత కారణంగానే ఇలాంటి పుకార్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు..!!