
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్’ అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది.ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కొంతమంది పూనమ్ ను తిడుతుంటే మరోకొంతమంది స్వాగతిస్తున్నారు.

