తోలి తరం దర్శకులలో పి. పుల్లయ్య గారిది, ఒక ప్రత్యేకమయిన శైలి. పుల్లయ్య గారు నెల్లూరు వారు, అప్పటికి, ఇప్పటికి నెల్లూరు వారు మాటలలో కాస్త సంసృతం (బూతులు) ఎక్కువగా వాడుతారని ప్రసిద్ధి. ఆ భాష దోషం పుల్లయ్య గారికి కూడా ఉండేది, అదే కాకా, ఆయనకు ముక్కు మీద కోపం. మామూలుగానే అలవోకగా సంసృత ప్రయోగం చేసే వారికీ, కోపం వచ్చినప్పుడు అది మరి కాస్త ఎక్కువ అయ్యేది. అక్కినేని గారికి” ధర్మపత్ని” చిత్రం లో ఒక చిన్న పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు, ఆ సందర్భం లో అక్కినేని గారిని ఒరేయ్ అంటూ ఒక బూతు మాట ప్రయోగించి మాట్లాడేసరికి, అక్కినేని గారికి మతిపోయింది.
అదె విషయం మిగతా వారి తో చెప్తే అయన అంతే అండీ, కల్మషం లేని మనిషి, లైట్ గ తీసుకో అని సర్ది చెప్పారట. ఆ తరువాత కొద్దీ సంవత్సరాల తరువాత పుల్లయ్య గారు అక్కినేని గారిని తాను నిర్మిస్తున్న “అర్ధాంగి” చిత్రం లో హీరోగా తీసుకున్నారట. అక్కినేని గారు పుల్లయ్య గారి దగ్గరకు వెళ్లి మీరు బూతులు మాట్లాడితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఆలా మాట్లాడాను అంటేనే మీ చిత్రంలో నటిస్తాను అని ఖచ్చితం గ చెప్పేసారట. ” నీ పాసుగాల అటువంటివన్నీ మనసులో పెట్టుకోబాక, నా మాట తీరే అంత” అని సర్ది చెప్పిన తరువాత ఆ చిత్రంలో అక్కినేని గారు నటించటం జరిగింది.