in

production house Mythri Movie Makers Warning For trollers!

పుష్ప 2 హిట్ అయితే, అత్యధిక వసూళ్లు సాధిస్తే ఆ క్రెడిట్ తెలుగు మూవీకి దక్కుతుంది. బన్నీ కి కాదు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోకుండా ఫ్యాన్ వార్ ఎందుకు. ఇలా అయితే నెక్స్ట్ మంత్ గేమ్ చేంజెర్ మూవీ రిలీజ్ ఉంది. అప్పుడు బన్నీ ఫాన్స్ రెచ్చిపోరా. దీని వలన మొత్తం సినిమా నష్టపోతోంది, వ్యక్తి కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేయటం కోసం సినిమాలో ఉన్న డైలాగ్ ఒకటైతే, ఇంకోలా ప్రచారం చేస్తూ మెగా ఫాన్స్ ని రెచ్చగొడుతున్నారు. దీనిపై తాజాగా మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది.

ఎవరికి వారు లేనిది ఊహించి, ఓన్ క్రియేటివిటితో కొన్ని డైలాగులు పుష్ప-2 లోవి అంటూ ప్రచారం చేస్తున్నారు. వాంటెడ్ గా సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు ఆపండి, లేకపోతే ఇలాంటి పోస్ట్ లు పెట్టిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిక జారీ చేసింది. అంతే కాదు పుష్ప 2 హిట్ అయిన సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌ పేరు చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తున్నవారితో కూడా తమకి ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ అనౌన్స్ చేసింది..!!

Balakrishna announced Aditya 369 sequel with his son Mokshagnya!

Pushpa 2: The Rule sets a new record to earn ₹800 crore in 4 days!