in

producer worry with hot anchor anasuya’s negligence!

సినిమా మొదటి రోజు టాక్ ను బట్టి.. ఫలితం ఆధారపడి ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు. ఏ సినిమాకైనా ఇంతే..! అయితే విడుదల రోజున జనాలని థియేటర్ కు రప్పించాలి అంటే ప్రమోషన్ చాలా అవసరం. ఎంత బాగా ప్రమోషన్ చేస్తే ఆ సినిమా పై అంత క్రేజ్ పెరుగుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరుగుతాయి.ఇదిలా ఉండగా.. చిన్న సినిమాలకైతే కాస్త పేరున్న ఆర్టిస్ట్ లను తీసుకునేది ఇలా ప్రమోషన్లకు ఉపయోగపడతారనే..!

సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి అన‌సూయ‌నే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. సినిమా ఈమె పాత్ర పైనే ఆధారపడి నడుస్తుందట. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్న పాత్ర ఇది. అయితే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం ఈమె రావడం లేదు. అన‌సూయ‌తో ప్రమోషన్ చేయిస్తే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని నిర్మాత‌ అనుకున్నాడు. భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేసాడు.కానీ అన‌సూయ మాత్రం స్పందించడం లేదు. చిత్ర బృందానికి స‌హ‌కరించడం లేదు అని తెలుస్తుంది.

ఈ మధ్యనే ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది.కానీ దీనికి అనసూయ హాజరు కాలేదు. మరొపక్క రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. దీంతో నిర్మాత కు టెన్షన్ మొదలైంది. అదే `పుష్ఫ ` వంటి సినిమలో చిన్న పాత్ర పోషించినా… ఆమె తెగ ప్రమోషన్లు చేసింది. అలాంటి పెద్ద సినిమాలకి ఏమో కానీ ఇలాంటి చిన్న సినిమాలని మాత్రం ఈమె పట్టించుకోకపోతే అనసూయ పై మరింత విమర్శల వర్షం కురిసే ప్రమాదం ఉంది.

Shivani Rajasekhar to participate in Miss India audition!

Three heroines in Pawan Kalyan – harish shankar movie!