in

Producer shouted, abused my manager: Adah Sharma

దా శర్మ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. డేట్స్ సర్దుబాటు చేసే క్రమంలో ఓ నిర్మాత తన మేనేజర్‌ను బూతులు తిట్టారని, ఆ నిర్మాత తీరు వల్ల తాను నెల రోజుల పాటు ఎలాంటి పని లేకుండా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు..

తాను ఒకే సమయంలో మూడు సినిమాలకు అంగీకరించానని, అయితే మొదటి సినిమా డేట్స్ పదే పదే మారడంతో మిగతా రెండు ప్రాజెక్టుల షెడ్యూల్స్‌కు ఇబ్బంది వచ్చిందని ఆదా తెలిపారు. అయినా సరే మొదటి సినిమా నిర్మాత తనకు ఆ పలానా తేదీలే కావాలని పట్టుబట్టారని, ఈ క్రమంలో తన మేనేజర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా ఇద్దరు దర్శకులు చాలా హుందాగా వ్యవహరించి తమ షూటింగ్ తేదీలను మార్చుకున్నారని ఆదా వివరించారు..!!

Lavanya Tripathi files complaint against online abuse!

Tamannaah Bhatia set for key role in Ravi Teja’s Irumudi!