in

producer Naga Vamsi clarifies about jr ntr’s war 2 telugu rights!

న్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన “వార్ -2” సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. హృతిక్-తారక్ మధ్య ఓ పాట మాత్రమే మిగిలింది. అయితే ఈ సినిమా తెలుగు హక్కుల విషయంలో గత కొంతకాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేస్తోందనేది వాటి సారాంశం..

తాజాగా ఆ వార్తలపై నిర్మాత నాగ వంశీ స్పందించారు. ”తారక్ అభిమానులందరికీ విన్నపం..వార్-2 హక్కుల కొనుగోలు విషయంలో వస్తున్న వార్తలు నిజం కావు. మా ప్రాజెక్టులకు సంబంధించిన ఏ విషయమైనా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తాం” అని X లో ట్వీట్ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. కియారా అద్వానీ, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు.!!

fans expecting good news from samantha and sobitha!

Young Hero kartikeya to play villain In Chiranjeevi film?