ప్రియాంక మోహన్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలో ఏ సినిమాలో కూడా శృతిమించి ఎక్స్పోజింగ్ చేయలేదు. అయితే నటి ప్రియాంక ప్రస్తుతం అవకాశాలు లేక చాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన జాబిలమ్మా నీకు అంత కోపమా చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు..
అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే ఇలాగే ఉంటే అవకాశాలు రావు అనుకున్నారు ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు సిద్ధమయ్యింది ప్రియాంక మోహన్. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!