in

Priyanka Arul Mohan confirmed to play Kanmani in ‘OG’!

వర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను శనివారం చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె ‘కన్మణి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘ఓజాస్ గంభీర’ అనే పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. తాజా పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.!!

32 years for aditya 369!