
ప్రియమణి దక్షిణాది చిత్ర పరిశ్రమకు లభిస్తున్న ఆదరణపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలను పట్టించుకోని ప్రేక్షకులు ఇప్పుడు వాటిని ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ మార్పు తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రాంతీయ, హిందీ చిత్రాల మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయని, భవిష్యత్తులో ఈ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులు ఇప్పటికైనా దక్షిణాది సినిమాలను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటినుంచో ఇక్కడ మంచి సినిమాలు వస్తున్నాయి, కానీ వాటికి గతంలో సరైన ప్రాధాన్యత దక్కలేదు. ప్రతి భాషలోనూ అద్భుతమైన చిత్రాలు రూపొందినా, వాటి గురించి మాట్లాడేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు అలాంటి చిత్రాలే భారీ విజయాలు సాధించడం నిజంగా గొప్ప విషయం’’ అని తెలిపారు..!!

