in

Priya Bhavani, Malvika Sharma in for Gopichand’s ‘bheemaa’!

న్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా భీమా..గతకొద్ది రోజులుగా సినిమాలోని యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్న మూవీ టీం ఇటీవలనే ఫైట్ సీన్స్ కు సంబందించిన షూటింగ్ కంప్లిట్ చేసి ప్రస్తుతం సినిమాలో ఉండే లవ్ పోర్షన్ తెరకెక్కించడానికి రెడీ అయింది. ఇప్పటివరకు హీరోయిన్ లేకుండానే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా. లేటెస్ట్ గా భీమా సినిమాలో హీరోయిన్ ఎవరో ప్రకటించింది. ఆమె మరెవరో కాదు ప్రియా భవాని శంకర్..

ఇటీవలనే తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది..ఈ హీరోయిన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి..ఇక లేటెస్ట్ గా భీమా సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. గోపిచంద్ భీమా లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. గతంలో కూడా గోపిచంద్ పోలీస్ పాత్రలో చేసిన సినిమాలన్నీ ఘన విజయం సాధించగా.. భీమా కూడా అలాంటి విజయమే సాదిస్తుందని నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేలటికెట్ మూవీ ఫేం మాళవిక శర్మ ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Ramya krishna’s Important role in NTR’s devara?

jailer!