in

Prithviraj sukumaran rejected rajinikanth and chiranjeevi film offers!

ళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పాన్ ఇండియా హీరోగా, విలన్ గా సత్తాచాటుతూ, పాన్ ఇండియా దర్శకుడిగా కూడా మారాడు. మొదట మలయాళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్ తరవాత తమిళం, తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో కూడా నటించి తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన సలార్ మూవీలో కీలక రోల్ ప్లే చేసాడు పృథ్వీరాజ్. సలార్2 లో కూడా పృథ్వీరాజ్ కీలకంగా మారాడు. నెక్స్ట్ రాజమౌళి – మహేష్ కాంబో మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇంకో వైపు దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు..

తాజాగా ఒక వేదిక పై మాట్లాడుతూ  తాను రజనీ కాంత్ కి, చిరంజీవి కి నో చెప్పినట్లు తెలిపాడు. లూసిఫర్2 ని నిర్మించిన లైకా ఎంటర్టైన్మెంట్స్ గతంలో రజనీ కాంత్ తో ఒక సినిమా చేయమని తనని అడగ్గా కుదరక నో చెప్పినట్లు తెలిపాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా పృథ్వీరాజ్ రెండు సార్లు నో చెప్పాడట. లూసిఫర్ మూవీ తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసారు. ఈ మూవీని పృథ్వీరాజ్ నే డైరెక్ట్ చేయమని చిరు కోరారట. కానీ తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదట. సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు స్వయంగా ఓ కీ రోల్ ఆఫర్ చేస్తే  వదులుకున్నాడట..!!

beauty nidhi agarwal playing a DE glamour role in ‘raja saab’!

anjali breaks silence on ‘Game Changer’ failure and her role!