
అతని గొంతు వింటే గుండె దడ,దడలాడుతుంది, అతని యాక్షన్ చూస్తే ముచ్చెమటలు పడతాయి, అతనే బొమ్మాలి రవిశంకర్, దాదాపు 3500 చిత్రాలలో వివిధ నటులకు తన గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కం నటుడు,భారీగానే ఉంది కదూ వినడానికి,అతను చేసే పనులు కూడా భారీగానే ఉంటాయి, అదేమిటో తెలుసుకోవాలంటే ఈ మొత్తం కథ, చదవ వలసిందే. రవిశంకర్ గారిది లవ్ మ్యారేజ్. లవ్ లో ఉన్నపుడు ఎవరయినా అమ్మాయికి పువ్వు, సెల్ ఫోన్, రింగ్, ప్రెజెంట్ చేస్తాడు, మనవాడు ఏం ప్రెజెంట్ చేసాడో తెలుసా.ఓ క్రిస్మస్ రోజున అయన గారి లవర్ కి క్రిస్మస్ ట్రీ దొరకలేదు, ఆ విషయం తెలిసిన మనవాడు ఆవేశం గ కవాసకి బజాజ్ బైక్ స్టార్ట్ చేసి ఫ్రెండ్ ని వెంటేసుకొని క్రిస్మస్ ట్రీ వేట మొదలెట్టాడు, ఆ వేట మహాబలిపురం దాక సాగింది,చివరికి రవిశంకర్ గారి వేట ఫలించింది, ఫలితంగా ఆవిడగారి ఇంటి ముందు , 9 ఫీట్ క్రిస్మస్ ట్రీ తో బాహుబలి లాగా ప్రత్యక్షం అయ్యారు,ఆవిడ క్రిస్మస్ ట్రీ చూడగానే బహు బాగున్నది అని ముద్దు పెట్టేసిందో ఏమో మనకైతే తెలియదు, అంత పెద్ద ట్రీ ని బైక్ మీద మోసుకొని వచ్చి ఆమెకు ప్రెజెంట్ చేసారు.లవ్వా,మజాకా పెళ్లయ్యాక పెళ్ళాం కోసం ఎవడైనా ఇంత సాహసం చేస్తారా చెప్పండి,ఎవడు చేయదు,లవర్ కోసం చేసే పనుల్లో ఉండే ఆ కిక్కే వేరప్పా, రాసుకోరా సాంబ.

