in

preminchina ammaiku shock icchina sunil!

న కమెడియన్ మరియు హీరో అయిన, సునీల్ గారు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి మీద మనసు పడ్డారు, ఇది ఆ ఏజ్ లో అందరి కి జరిగే ఎక్సపీరియెన్స్ కదా ఇందులో విచిత్రం ఏముంది అనుకోకండి, క్రష్ మొదలు అయితే దాన్ని వాళ్లకు చెప్పటానికి ఒక్కొక్కరు, ఒక్కో విధానం ఫాలో అవుతారు. ఇప్పట్లాగా వాట్సాప్, లో సెల్ ఫోన్ లు అప్పట్లో లేవు కాబట్టి, అప్పటి యూత్ కి ఉన్న ఒకే ఒక్క ఆయుధం గ్రీటింగ్ కార్డు, లెటర్. న్యూ ఇయర్ కి గ్రీటింగ్ ఇవ్వాలి అనుకోని ఒక మంచి గ్రీటింగ్ కార్డు కొన్న సునీల్, తన ఫ్రెండ్స్ లో ఒకరికి దుబాయ్ నుంచి వచ్చిన గ్రీటింగ్ కార్డు చూడటం తటస్థించింది, అందులో స్పెషలిటీ ఏంటంటే కార్డు ఓపెన్ చేయగానే, మంచి మ్యూజిక్ తో విషెస్ వినిపిస్తాయి, అప్పట్లో అది చాలా కొత్తగా అనిపించి, ఆ ఫ్రెండ్ ని అడిగి ఆ కార్డు తీసికొని అందులోని మ్యూజిక్ వస్తున్నా మిషన్ ను తీసి తాను కొన్న న్యూ ఇయర్ గ్రీటింగ్ లో ఫిక్స్ చేసారు సునీల్.

ఇక ఆ రోజు రాత్రంతా నిద్ర లేదు రేపు తాను గ్రీటింగ్ కార్డు ఇవ్వగానే, ఆ అమ్మాయి ముఖం లో ఎక్స్ప్రెషన్స్ ఉహించుకొని తెగ ఫీల్ అయిపోయారు. మరుసటి రోజు ఆ అమ్మాయి కోసం కాపు కాసి, ఆమె కనిపించగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఈ గ్రీటింగ్ కార్డు ఆమె చేతిలో పెట్టారు, ఓపెన్ చేసి చూసిన ఆ అమ్మాయి కి కొంచెం సేపు ఏమి అర్ధం కాలేదు, ఎందుకంటే గ్రీటింగ్ కార్డు ఏమో న్యూ ఇయర్ ది, కార్డు ఓపెన్ చేయగానే మ్యూజిక్ వచ్చి మెర్రి క్రిస్మస్ అంటూ విషెస్ వినిపిస్తున్నాయి, మనవాడి టాలెంట్ కి ఆ అమ్మాయి షాక్ అయింది కాని రెస్పాండ్ అవ్వలేదు, ఎలా అవుతారండి ఎవరైనా ఇటువంటి బుర్ర తక్కువ పని చేస్తే.మొదటి ప్రయత్నం ఆ విధం గ బెడిసికొట్టడం తో, మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయలేదు సునీల్.

mahesh babu into ott business!

rashmika mandhanna’s 2 conditions!