
సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సూర్య 46వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం..
మలయాళంలో ‘ప్రేమలు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..!!

