అషూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేయడమే కాకుండా.. యూట్యూబ్ వీడియోలతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ఓ షాకింగ్ విషయం వెల్లడించింది. ఇదంతా ఆమె కెమేరాలో రికార్డు చేసింది. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న అషూ రెడ్డిని ఏమైందని తల్లి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె అషూ స్పందిస్తూ.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదని టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్’’ అని వచ్చిందని చెప్పింది. అయితే, మొదట్లో ఈ విషయాన్ని ఆమె తల్లి, ఫ్రెండ్స్ నమ్మలేదు.
జోక్ చేస్తోందని అనుకున్నారు. తల్లి మాత్రం కాసేపు మౌనంగా ఉండిపోయింది. అనంతరం అషూ ఏడ్చేయడం చూసి అంతా నమ్మేశారు. అషూ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏం చేయమంటావు అమ్మా’’ అని అడిగింది. దీంతో ఆమె ‘‘నాన్నకు చెప్పు అంది. ఏదైనా తాగి చద్దాం. నీన్ను ఇలా పెంచినందుకు నన్నే అంటారు’’ అని తెలిపింది. ఇలా కాసేపు వారి ఇంట్లోవారితో చర్చ జరిగింది. ఆ తర్వాత కోపంతో తల్లి ఆమెను కొట్టింది. కాలితో కూడా తన్నింది. ‘‘అమెరికా వెళ్లి జాబ్ చేసుకోమన్నా కదా’’ అంటూ తిట్టింది. ‘‘నీ పని ఇలా కాదు..
ఈ విషయాన్ని డాడీకి చెబుతా’’ అంటూ అక్కడి నుంచి ఫోన్ తెచ్చి కాల్ చేసింది. దీంతో అషూ.. తన తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు ఫోన్ చేయొద్దని చెప్పింది’’. తన ఫ్రెండ్స్ కూడా ఆమెను కాల్ చేయొద్దని అడిగారు. ఇది సరదాగా చేసిన ప్రాంక్ వీడియో అని, నిజం కాదని చెప్పారు. ఆ తర్వాత రూమ్‌లో పెట్టిన కెమేరాలను చూపించారు. దీంతో మరింత కోపం వచ్చింది. ‘‘నీకు ప్రాంక్‌లా ఉంది. నాకు హార్ట్ ఎటాక్‌లా ఉంది. ఇలాంటి విషయాలను జోక్ చేస్తారా?’’ అంటూ మరో రెండు దెబ్బలు తగిలించింది. ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.