కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనిలేక తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న ఎందరికో తమ వంతు సాయం అందిస్తున్నారు పలువురు సెలెబ్రేటిస్. కొందరు విరాళాలు ఇచ్చారు. మరికొందరు వారికీ తోచిన సహాయం చేస్తున్నారు. అంటువంటివారిలో మండుతుంది హీరోయిన్ ప్రణీత. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ కాదు. ఆమె చేతిలో అన్ని భారీ సినిమాలు లేవు. అయినా ఇటువంటి విపత్కర సమయంలో తనకు చేతనైనంత సాయం చేస్తుంది హీరోయిన్ ప్రణీత..ఎవరికి పైసా ఉపయోగం లేని పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ చేయకుండా ఎంతోమంది పేదల కడుపులు నింపుతూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటుంది.
తానే సొంత ఖర్చుతో, స్వయంగా వంట చేసి మరి చాలా మంది ఆకలి తీరుస్తుంది. లాక్‌డౌన్ మొదలైన తరవాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసింది. ముఖానికి మాస్కు ధరించి ప్రణీత వంట చేస్తూ, ప్యాకింగ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందంతో పాటు అందమైన మనసును అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రణీత ఇప్పటికే టాలీవుడ్ లో పేద కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసెస్ ఛారిటీకి ముందుగా లక్ష రూపాయలను ఇచ్చి మిగతా హీరోయిన్స్ కి ఇన్స్పైర్ గా నిలిచింది.