in

Prakash Raj Reacts: No Ban on Fawad’s Khan Film!

మరో వివాదంలో చిక్కుకున్న ప్రకాష్ రాజ్
ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిస్పందనగా పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను భారత్‌లో విడుదల చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబిర్ గులాల్‘ అనే సినిమా విడుదలపై కూడా నిషేధం కొనసాగుతోంది..

పాకిస్తాన్ నటుడు సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్
దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. “ఫవాద్ ఖాన్ సినిమాను ఇండియాలో నిషేధించడం సరైనదిగా అనిపించడం లేదు. ముందు సినిమాను విడుదల చేస్తే, ప్రేక్షకులు పాకిస్థానీ నటుల సినిమాలను ఆదరిస్తారో లేదో స్పష్టమవుతుంది. ఫలితాన్ని వారికే వదిలేయడం మంచిది” అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్న సమయంలో, పాకిస్థానీ నటుడి సినిమా విడుదల గురించి ప్రకాశ్ రాజ్ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది..!!

Trisha and Simbu are going to marry?

Mrunal Thakur in a Relationship with telugu Actor Sumanth?