కంచె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసింది. తర్వాత పలు సినిమాలో నటించిన ఈ అమ్మడు.. బాలీవుడ్ లోను పలు సినిమా అవకాశాలను దక్కించుకుని నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తను నటించిన ఓ హిందీ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ..తాను ఒంటరిగా ఉన్నానని వెల్లడించింది..
హుషారైన కుర్రాడితో డేటింగ్ కి సిద్ధంగా ఉన్నాను అంటు చెప్పిన ప్రగ్య..ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయడానికి రెడీనా అని ఇంటర్వ్యువర్ ప్రశ్నకు ఆనందం వ్యక్తం చేసింది. ఎందుకు కాదు..తప్పకుండా డేటింగ్ చేస్తా అంటూ చెప్పింది. ఇక యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్ పేరు చెప్పగానే..ఈమె పెద్దగా నవ్వేసింది. తప్పకుండా డేటింగ్ చేస్తానని.. డస్టినీల ఏది ఉంటే అదే జరగొచ్చు.. నేను డెస్టినీని నమ్ముతా అంటూ చెప్పుకొచ్చింది.