in

prabhas to do a full length villain role?

ప్రభాస్ ఇటీవల కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు డార్లింగ్ ప్రభాస్ కేవలం హీరోగా మాత్రమే నటించారు. కానీ ఇకమీదట ప్రభాస్ విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేట్‌ ఆడియన్స్‌ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్‌గా కూడా అదే రేంజ్‌లో మెప్పించాలనుకుంటున్నాడట..

ఇప్పటికే సలార్ మూవీలో చూపించిన గ్రే షేడ్ క్యారెక్టర్‌ తో రచ్చ చేసిన ప్రభాస్, ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి ఫుల్ ఫ్లెడ్జ్ యాంటీ హీరోగా రెచ్చిపోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ కి చెందిన డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఆ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రమే ఇంకా తెలియడం లేదు. ప్రభాస్ కి కథ బాగా నచ్చిందని, అందుకే ఒక్క మీటింగ్ లోనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది..!!

rashmika: love changes people and their thoughts

deepika rangaraju comments on vijay devarakonda!