in

Prabhas to Collaborate with pushpa director Sukumar?

టాలీవుడ్‌లో హీరో మరియు డైరెక్టర్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమానులు తమకు ఇష్టమైన హీరో, ఫేవరెట్ దర్శకుడితో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అగ్ర హీరోలు ప్రభాస్ మరియు రామ్ చరణ్‌లకు సంబంధించి రెండు అరుదైన కాంబినేషన్లు సెట్ కాబోతున్నాయనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి కాంబినేషన్‌లో హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం సుకుమార్, రామ్ చరణ్‌తో ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఆ సినిమా పూర్తయ్యాక, ప్రభాస్-సుకుమార్ కాంబో పట్టాలెక్కడం ఖాయమని సమాచారం..!!

rrr actress Olivia Morris on board for ntr neel film?