బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఇప్పుడు తన సినిమా అంటే మినిమం 300 నుంచి 400 కోట్లు ఉండాల్సిందే. తన పారితోషికం కూడా ఇంచుమించుగా వంద కోట్లు. అందుకే హైదరాబాద్ శివార్లలో ప్రభాస్ ఓ విలాసవంతమైన గెస్ట్ హోస్ ని నిర్మించుకోవాలని చూస్తున్నాడట. హైదరాబాద్ లోని నానాక్‌రామ్ గూడాలో ప్రభాస్‌కి రెండు ఎకరాల స్థలం ఉంది. అక్కడ ఓ గెస్ట్ హౌస్ ని కట్టే ప్రయత్నాలు మొదలయ్యాయట. గెస్ట్ హోస్ అంటే…గెస్ట్ హోస్ లానే కాదు.దాన్ని ఫామ్ హోస్ గా చేయాలన్నది ప్లాన్.
షూటింగులు అయ్యాక రిలాక్సేషన్ కోసం అక్కడ అన్ని సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. పైగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ముంబై నుంచి హైదరాబాద్… హైదరాబాద్ నుంచి ముంబై తిరుగుతూ ఉండాలి. ఎయిర్‌పోర్ట్ కి దగ్గరగా ఇల్లు ఉంటే బాగుంటుందన్నది ప్రభాస్ ఆలోచన. అందుకే షంషాబాద్ లో గెస్ట్ హోస్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రభాస్‌కి హైదరాబాద్ లో రెండు ఇల్లున్నాయి. కాకపోతే అవి సిటీ మధ్యలో ఉన్నాయి. అందుకే.. ప్రభాస్ ఈనిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.