
ప్రభాస్ మరోసారి తన ఉదారతతో అభిమానుల మనసు దోచుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సినిమా కోసం పనిచేసిన సిబ్బందిని ప్రభాస్ మర్చిపోలేదు.ఈ చిత్రానికి సంబంధించి, చిత్ర బృందానికి ఆయన ప్రత్యేకంగా బోనస్‌లు అందజేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, కష్టపడ్డ టీమ్‌కు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రధాన సాంకేతిక విభాగాల వారికి ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున, గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసిన సిబ్బందికి రూ.10,000 చొప్పున ప్రభాస్ స్వయంగా బోనస్ అందించినట్లు సమాచారం..
ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు, అభిమానులు ఆయన మనసు ఎంతో గొప్పదని ప్రశంసిస్తున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.205 కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ, అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, టీమ్‌పై తన నమ్మకం, ప్రేమ ఎప్పటిలాగే నిలకడగా ఉందని ప్రభాస్ మరోసారి నిరూపించారు. గతంలో సాలార్, కల్కి 2898 AD వంటి చిత్రాల సమయంలోనూ ప్రభాస్ ఇదే విధంగా టీమ్‌ను ప్రోత్సహించిన ఉదాహరణలు ఉన్నాయి. విజయమో, పరాజయమో అన్న తేడా లేకుండా తనతో కలిసి పనిచేసిన వారిని గౌరవించే ఆయన వైఖరి అభిమానుల్లో మరింత ఆదరణ పొందుతోంది..!!
