in

prabhas rajasaab effect, no more dupes please!

రాజాసాబ్‌` విమ‌ర్శ‌ల పాలైన నేప‌థ్యంలో ఈసారి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ప్ర‌భాస్ సినిమా అన‌గానే, యాక్ష‌న్ పార్ట్ బాడీ డ‌బుల్, డూప్‌తో తీస్తార‌న్న ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. అయితే ‘ఫౌజీ’ కోసం మాత్రం వీలైనంత వ‌ర‌కూ డూప్ ని దూరంగా ఉంచాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నారు. ‘స్పిరిట్‌’ లోనూ డూప్ వాడ‌డానికి సందీప్ రెడ్డి వంగా ఇష్ట‌ప‌డ‌డం లేదు..

ఇక నుంచి అన్నీ వ‌ర్జిన‌ల్ షాట్సే ఉండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. `పౌజీ`లోనూ ఆ మార్పు క‌నిపించ‌నుంద‌ని టాక్‌. అవ‌స‌ర‌మైతే త‌ప్ప డూప్ వాడ‌కూడ‌ద‌న్న‌ది ఓ కండీష‌న్ గా పెట్టుకొన్నార‌ని తెలుస్తోంది. అభిమానులు సినిమాకు వ‌చ్చేది త‌మ హీరోని వెండి తెర‌పై చూడ‌డానికే. అంతే త‌ప్ప డూప్ కోసం కాదు. ఈ విష‌యాన్ని హీరోలంగా గ్ర‌హిస్తే బాగుంటుంది. ప్ర‌భాస్ లో ఈ మార్పు ఆహ్వానించ‌ద‌గిన‌దే..!!

nithya menen Was First Approached For Mahanati!

Prakash Raj rubbishes prabhas ‘Spirit’ exit rumours!