ఇండియాలో బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణను తీసుకొచ్చిన ప్లేయర్స్‌లో పీవీ సింధు ఒకరు. ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ మొదలుకొని పలు అంతర్జాతీయ టోర్నీలలో విజేతగా నిలిచి సింధు పలు రికార్డ్ లను క్రియేట్ చేసింది సింధు. ఇటీవలే కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్రను సృష్టించింది. తాజాగా అలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ టాక్‌షోకు సింధు గెస్ట్‌గా హాజరైంది. ఇందులో తన వ్యక్తిగత జీవితం, ఇష్టాలతో పాటు ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో ప్రభాస్ తన ఫేవరేట్ హీరో అని సింధు తెలిపింది..
ప్రభాస్, తాను బెస్ట్ ఫ్రెండ్స్‌మని చెప్పింది. ప్రభాస్‌తో పాటు చాలా మంది హీరోలను ఇష్టపడతానని పేర్కొన్నది. భవిష్యత్తులో స్క్రీన్‌మీద సింధును హీరోయిన్గా చూడొచ్చా అంటూ అలీ అడిగిన ప్రశ్నకు ఏమో ఉండొచ్చు అంటూ సింధు ఆసక్తికరంగా సమాధానమిచ్చింది..అంతేకాకుండా తన బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బదులిచ్చింది. అందులో తానే నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చింది. ప్రేమ, పెళ్లి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు చాలా ప్రేమలేఖలు వస్తుంటాయని, వాటిని అమ్మనాన్నలతో కలిసి చదువుతుంటానని చెప్పింది.