పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి మర్యాదలకు ఎవరైన ఫిదా కావల్సిందే. ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్లో ఉంటాయని ఇప్పటికే చాలామంది చెప్తుంటే విన్నాం. షూటింగ్ సెట్లో ప్రభాస్ ఉంటే చాలు ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగేనట. వెరైటీ వంటలతో ఆయన చేసే అతిధి మర్యాదలకు చిత్ర యూనిట్ తెగ ఫిదా అవుతుందట. సాహో సమయంలో శ్రద్ధా కపూర్ కోసం వెరైటీ వంటలు చేయించాడు ప్రభాస్. ప్రభాస్ చేసిన అతిధి మర్యాదలకు కృతి సనన్ ఫిదా అయిపోవడమే కాదు..
సెట్ లో అందరి తిండి వివరాలపై ప్రభాస్ ఓ కన్నేసి ఉంటాడని చెప్పుకొచ్చింది. నదియా కూడా ప్రభాస్ విందు గురించి పొగడడం విన్నాం. ఇక సలార్ బ్యూటీ శృతి హాసన్ తన కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది . ఈ విందులో ప్రభాస్ చేయించిన ఆ రుచులకు శృతి ఫ్లాట్ అయిపొయింది. సో హ్యాపీ అంటూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇక ఇటీవల సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వివిధ వంటకాలు తయారు చేయించి పంపించారు.
ప్రభాస్ పంపిన వంటకాల్లో స్పెషల్ బిర్యానీ, ఖీర్, నాన్ వెజ్ కర్రీ ఉన్నాయి. సైఫ్ అర్ధాంగి కరీనా కపూర్ ఈ వంటకాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాహుబలి బిర్యానీ పంపిస్తే అది కచ్చితంగా ది బెస్ట్ అవుతుంది… థాంక్యూ ప్రభాస్ అంటూ కరీనా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తాజాగా ప్రాజెక్ట్ కె బ్యూటీ దీపికా పదుకొణేని తన అతిథి మర్యాదలతో స్టన్ చేశాడు ప్రభాస్. వెరైటీ వంటకాలు దీపికా కోసం చేయించగా, అవి చూసి తెగ సంతోషించింది దీపికా.