డార్లింగ్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. నాన్ వెజిటేరియన్ వంటకాల్ని ప్రత్యేకంగా ఇష్టపడతారు. కక్క.. ముక్క లేనిదే ముద్ద దిగదని ప్రభాస్ స్వయంగా చాలామీడియా ఇంటర్వ్యూల్లో బాహాటంగానే వెల్లడించారు. ఇంట్లో ఉన్నా..షూటింగ్ లో ఉన్నా ఎక్కడైనా సరే లంచ్…డిన్నర్ లో తప్పనిసరిగా నాన్ వెజీ కర్రీస్ ఉండాలి. క్షత్రియ వంశస్తుడు కాబట్టి ప్రభాస్ కి చిన్న నాటి నుంచి అలాగే అలవాటు. వరల్డ్ వైడ్ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ ని ప్రభాస్ తప్పక రుచి చూస్తారు.
తనకంటూ ప్రత్యేకంగా ఇంట్లో ఓ విదేశీ చెఫ్ మాస్టర్ నే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడా నాన్ వెజ్ అలవాట్లని తన కోస్టార్లకు కూడా అలవాటు పడేలా చేస్తున్నారట..ఆంధ్రా స్టైల్ లో అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ని ప్రభాస్ తన చెఫ్ నుంచి తయారు చేయించి శ్రుతిహాసన్ కి సెట్స్ లో వడ్డించారట. కొన్ని రకాల పురాతన వంటకాలు.. అరబిక్ స్టైల్ మాంసం.. గోంగూర మాంసం.. బిరియానీ.. దుబాయ్ స్టైల్ మండి బిర్యానీ ..చికెన్.. మటన్ .. పీతలు..రోయ్యల పులుసు..
మటన్ కర్రీల్లో రకాలు అన్నింటిని ప్రభాస్ కారణంగా శ్రుతి టేస్ట్ చేసేసిందిట. అలాగే కొన్ని రకాల వెజ్ ఐటమ్స్ కూడా తయారు చేయించారని ఓ వీడియో ద్వారా తెలిపింది. నాన్ వెజ్ లో ఇన్నిరకాలు ఎప్పుడూ రుచి చూడలేదని..ప్రభాస్ ని ఈ సందర్భంగా అత్యంత పురాతన వంటకాలు తినే పురాతన మానవుడని అభివర్ణించింది. ప్రభాస్ తనపై చూపించిన ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతి హాసన్ తెలిపింది.