in

Prabhas fans shock and upset with his decison!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బోలెడు భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు “రాధే శ్యామ్” సినిమా వాయిదా పడుతూ ఉండగా మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే, వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమాని అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. చిన్న బడ్జెట్ రొమాంటిక్ కామెడీ సినిమాలకి పెట్టింది పేరైన మారుతి ఇప్పుడు ప్రభాస్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ లిమిటెడ్ కాల్షీట్స్ ఇవ్వబోతున్నట్లు, మారుతి ఆ కాల్షీట్ల లోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు ప్రభాస్ అభిమానులు మాత్రం మారుతితో ప్రభాస్ సినిమా ఏంటి అంటూ వాపోతున్నారు. మారుతి స్టైల్ ఆఫ్ డైరెక్షన్ మరియు ప్రభాస్ ఇమేజ్ రెండు చాలా భిన్నంగా ఉంటాయని వీరిద్దరి మధ్య సినిమా అంటే కమర్షియల్గా పెద్ద రిస్క్ అని అభిమానులు కంగారు పడుతున్నారు. మరి ప్రభాస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది.

Kangana Ranaut on why South stars are a ‘rage’!

Pooja Hegde Ramp Walk at Lakme Fashion Week!