మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ‘రుద్ర’ పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..
అంతకుముందు మేకర్స్ తన తెలుగు సినిమా అరంగేట్రం అయిన శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన పోస్టర్‌ను రిలీస్ చేసారు. ఇప్పుడు, ప్రభాలను రుద్ర అని వెల్లడించడంతో సినిమా పై మంచి హైప్ ఏర్పడింది..విష్ణు మంచు, మోహన్ బాబు, మరియు ప్రభు దేవా చేత ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో ప్రదర్శించిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే అధిక అంచనాలను కలిగి ఉంది. అద్భుతమైన విజువల్స్, మరియు కాస్ట్లీ సెట్టింగ్స్ తో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గ సాగుతుంది..!!