
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రా[/qodef_dropcaps] జమౌళి RRR తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ వస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. అయితే, ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతుంది అని సమాచారం, లీడర్, భరత్ అనే నేను, ఈ సినిమాలు లాగ కాకుండా ఢిల్లీ రాజకీయం చుట్టూ ఉండే ఒక పవర్ ఫుల్ కథను రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్. కథకు అనుగుణంగా ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను పెట్టె ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారంటూ సోషల్ మీడియా లొ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, మరి తారక్ ఈ సినిమాలొ చీఫ్ మినిస్టర్ రోల్ చేస్తాడా లేక ఉద్యమ వీరుడు పాత్రా ఏదైనా చేస్తాడా తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.