
పోసాని కృష్ణమురళి, రచయిత గ, క్యారెక్టర్ నటుడిగా మనందరికీ తెలిసిన ఒక విభిన్నమయిన వ్యక్తి, ఆయన కెరీర్ ప్రారంభ దశలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ గ పని చేసారు. ఆ రోజుల్లో ఒక రోజు ఆవేశంలో పరుచూరి గోపాలకృష్ణ గారి భార్యను పొడవటానికి ఒక కత్తి కొన్నారు అదృష్ట వసాత్థు ఆయన మనసు మార్చుకొని ఆ పని చేయలేదు. ఎందుకు పోసాని గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలి అంటే మనం రెండు దశాబ్దాలు వెనక్కు వెళ్ళాలి.పోసాని గారు పరుచూరి వారి అసిస్టెంట్ గ పని చేస్తున్న రోజుల్లో వీరి మకాం ఆఫీస్ ప్రక్కన ఉన్న రూమ్. మంచివాడు అని పేరు ఉండటం వలన భోజన సదుపాయం కూడా పరుచూరి వారి ఇంటనే. అటువంటి సందర్భం లో అనుకోకుండా, ఇంటినుంచి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట కు ఈయన గారి రూమ్ లో ఆశ్రయం ఇవ్వవలసి వచ్చింది. ఇదే విషయాన్నీ కొందరు వేరే విధంగా, అంటే, పోసాని గారే ఎవరో అమ్మాయిని రూమ్ కి తీసుకొని వచ్చారని మోసేసారు, గోపాలకృష్ణ గారి భార్యకు, కోపం వచ్చిన ఆవిడ ఆ విషయం గోపాలకృష్ణ గారికి చెప్పారు, అదివిన్న గోపాలకృష్ణ గారు ఒకింత ఆవేశానికి లోనై, పోసాని చెప్పబోయిన వివరణ వినకుండానే, నిన్ను పనిలోనుంచి తీసేస్తున్నాను వెంటనే వెళ్ళిపో అని కోపగించుకున్నారు. తాను తప్పు చేసానో లేదో చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్న తనని ఆలా వెళ్లగొట్టడానికి ఆవిడ చెప్పిన మాట కారణం, కాబట్టి ఆవిడను పొడవాలి అనే ఆవేశంలో కత్తిని కొన్నారు కానీ, అన్నిరోజులు తల్లిలా అన్నం పెట్టి ఆదరించిన ఆవిడను ఆలా చేయటం తప్పు అని తన నిర్ణయం మార్చుకున్నారు. ఎవరికో సహాయం చేయబోతే అది తనకు ఆలా చుట్టుకుంటుంది అని ఊహించని పోసాని గారు చాల రోజులు మధన పడ్డారట.ఇదండీ పోసాని గారు వేసిన మర్డర్ ప్లాన్ వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ స్టోరీ.

