
విజయ్ సేతుపతి , పేరులోనే ఏదో పవర్ ఉంది కదూ! హీరో పాత్రలు చేస్తూనే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ నటిస్తూ సెహబాష్ అనిపించుకుంటున్న నటుడు, విజయ్ సేతుపతి. చిరంజీవి గారి” సైరా ” మూవీ తో తెలుగు వారికీ కూడా దగ్గర అయ్యారు.ఈయన గారు నటుడు అవటానికి పడిన కష్టాల గురించి చెప్పాలి అంటే ఒక 15 రీల్స్ సినిమా అవుతుంది.దిగువ మధ్య తరగతి కుటుంబం లో జన్మించి, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఆ తరువాత” కొతుపట్టరై” అనే,ఒక నాటక కంపెనీ లో అకౌంటెంట్ చేరిన సేతుపతి అక్కడి నటుల, నటనను చూస్తూ, తాను కూడా నటుడవ్వాలనే ప్రయత్నం మొదలెట్టారు, అవకాశాల కోసం సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరగటం, వారి చీత్కారాలను భరించటం, మొహం మీదనే “నీ మొహానికి సినిమా కావాలా” అని అవమానించిన భరించారు. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, బాలు మహేంద్ర గారి అపాయింట్మెంట్ కోసం నెల రోజుల పాటు అయన ఇంటి ముందు పడిగాపులు కాసారు, చివరికి కరుణించిన అయన లోపలికి పిలిచి సేతుపతి గారి ఫొటోస్ చూసి, నీది మంచి ఫొటోజెనిక్ పేస్, తప్పకుండ హీరో అవుతావు అన్నారట. బ్రహ్మ దిగివచ్చి వరం ఇచ్చినంత ధైర్యం వచ్చింది సేతుపతి గారికి. కార్తిక్ సుబ్బరాజు పరిచయం తో, ఆయన తీసిన షార్ట్ ఫిలిం లో నటించారు, దానికి నార్వే షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, ఆ తరువాత కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ” పిజ్జా ” సినిమా తో హీరో గ అవతారం ఎత్తారు. “పిజ్జా” తరువాత తిరిగి చూడవలసిన పని లేకుండా బిజీ అయిపోయారు, నేను రౌడీనే, నవాబ్,సైరా సినిమా ల తో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గర అయ్యారు. ఇదండీ విజయ్ సేతుపతి గారి విజయ గాధ. సినిమా తీయడానికి సరిపోతుంది కదూ.విజయం దానంతట అదే మన గుమ్మం ముందుకు రాదు,పోరాడి సాధించాలి, సైరా విజయ్ సేతుపతి.

