
బుట్ట బొమ్మ పూజా హెగ్డే చాలా కాలంగా ఇంస్టాలో యాక్టివ్ గా ఉంది. అక్కడ వేడెక్కించే ఫోటోషూట్లు .. వీడియో షూట్లను ఎలాంటి దాపరికం లేకుండా పోస్ట్ చేస్తూ.. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఇంకా అక్కడ రెగ్యులర్ అప్ డేట్స్ తో వేడెక్కిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. కానీ ఇంతలోనే ఆకస్మికంగా ఈ బుధవారం రాత్రి తన ఇన్ స్టా ఖాతా హ్యాక్ అయ్యిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయమై తన డిజిటల్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు పూజా తెలిపింది. ఆమె డిజిటల్ టీమ్ ప్రస్తుతం ఆ ఖాతాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అది తిరిగి రెడీ అయ్యే వరకూ.. అభిమానులను ఎటువంటి ఆహ్వానాలను అంగీకరించవద్దని లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయొద్దని అభ్యర్థించింది. పూజా ప్రస్తుతం ప్రభాస్ సహా పలువురు అగ్ర కథానాయకుల సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
					 
					
