టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ప్రతిచోటా ఇప్పుడు పూజా హెగ్డేదే హవా. స్టార్ హీరోలందరికీ ఆమె ఫస్ట్ చాయిస్. నిజానికి మొదట నార్త్‌లో అదృష్టం కలిసి రాకపోవడంతో సౌత్‌లో లక్‌ని పరీక్షించుకుంది పూజ. సక్సెస్ అయ్యింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. అలా అని బీటౌన్‌ని విడిచి పెట్టలేదు. అక్కడా ప్రయత్నాలు సాగించింది. స్టార్టింగ్‌లో కాస్త తడబడినా ఉండేకొద్దీ అక్కడా మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ప్రస్తుతం సర్కస్, కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాల్లో నటిస్తోంది. త్వరలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో జాయిన్ కానుంది.
అదే..‘హౌస్‌ఫుల్ 5’. ఈ ఫ్రాంచైజీ ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. స్టార్ కాస్ట్‌తో భారీ బడ్జెట్‌తో ఇప్పటికే నాలుగు పార్ట్స్ నిర్మించాడు సాజిద్ నడియాడ్‌వాలా. ఇప్పుడు ఐదో పార్ట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. గత భాగాల్లో కంటే ఇందులో ఎక్కువమంది స్టార్స్ కనిపించనున్నారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, జాన్ అబ్రహామ్, బాబీ డియోల్ లాంటి వారంతా యాక్ట్ చేయబోతున్నారు. పూజతో పాటు కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఫిమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు..!!