
పూజా హెగ్డే నటించిన ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తర్వాత వరుస పరాజయాలు వచ్చేసరికి ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో హిందీ, తమిళ సినిమాలు చేయడంతో తెలుగులో పూజా హెగ్డే పని అయిపోయిందని కామెంట్స్ కూడా వినిపించాయి. కట్ చేస్తే..బుట్ట బొమ్మ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని అందాల బొమ్మ అందుకుందని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో యువ దర్శకుడు సుజీత్ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. ఆ సినిమా సెట్స్ మీదగా ఉండగా మరో సినిమా ఓకే చేసుకున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా సినిమా తీసేందుకు స్క్రిప్ట్ రెడీ చేశారు. నాని కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వం వహించబోయే చిత్రానికి ‘బ్లడీ రొమియో’ టైటిల్ ఖరారు చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పూజా హెగ్డే అందుకున్నారని సమాచారం. ఇప్పటి వరకు నానితో ఆవిడ సినిమా చేయలేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు..!!
