ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా కాగా, ఇందులో బుచ్చి ఒక ఫోక్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. “మా ఊరి ప్రెసిడెంట్” అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఓ పాపులర్ ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వనుండటం విశేషం. పైగా, ఉత్తరాంధ్ర ఫోక్ సింగర్ పెంచల్ దాస్ ఈ పాటను పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది..
ఇదిలా ఉండగా, సుకుమార్ ‘రంగస్థలం’లో “జిగేల్ రాణి” ఫోక్ సాంగ్‌ను తెగ హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బుచ్చి కూడా అదే తరహాలో ఫోక్ సాంగ్ ప్లాన్ చేయడంతో, “బుచ్చి గురువు సుక్కును కాపీ కొడుతున్నాడా?”, లేదా “సుక్కు రంగస్థలం నుంచి బయటపడగలిగినా, బుచ్చి ఇంకా దానిలోనే ఉన్నాడా?” అనే డౌట్స్ మొదలయ్యాయి. ‘జిగేల్ రాణి’గా రంగస్థలంలో పూజా హెగ్డే అలరించగా, ఇప్పుడు ‘పెద్ది’ కోసం బుచ్చి ఆమెనే తీసుకొస్తాడా? లేక ఇతర స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది..!!