in

pooja hegde signs for another item number?

ప్రస్తుతం హీరోయిన్ పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైం నడుస్తోంది. గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే చివరి క్షణంలో ఈ సినిమా నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా మొదట ఈ బ్యూటీని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో ఈ ఛాన్స్ కూడా కోల్పోయింది పూజా హెగ్డే.

దీంతో కెరీర్ లో ఎలాగైనా సెటిల్ అవ్వాలని వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. రవితేజ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డేను అడిగారట. దీనికి పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే..!!

Rana Daggubati aims for boxing legend’s biopic!

Rashmika Mandanna gives update on Pushpa 2