పూజా హెగ్దే ప్రస్తుతం తమిళ్ లో రెండు భారీ సినిమాలు చేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 44వ సినిమా రెట్రోలో నటిస్తున్న బుట్ట బొమ్మ మరోపక్క దళపతి విజయ్ చివరి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. సూర్య రెట్రోలో తన పాత్రకు వెయిట్ ఎక్కువ ఉంటుందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పూజా. ఇదే ఇంటర్వ్యూలో అమ్మడు అల వైకుంఠపురములో తమిళ సినిమా అనేసింది. అల వైకుంఠపురంలో సినిమా అల్లు అర్జున్ కి సెన్సేషనల్ హిట్ అందించింది..
త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా చేసింది. ఐతే అమ్మడు అది తమిళ్ సినిమా అని చెప్పడం తో బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. కొందరు టంగ్ స్లిప్ అయ్యి పూజా అలా అనేసిందని అంటుంటే టాలీవుడ్ నుంచి ఆఫర్లు రావట్లేదు కాబట్టి అమ్మడు కావాలని అలా చెప్పిందని అంటున్నారు. ఏది ఏమైనా అసలే కష్ట కాలం అనుకుంటున్న టైం లో పూజా హెగ్దే ఇలా టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను తమిళ్ సినిమా అనడం మాత్రం తెలుగు ఆడియన్స్ ని హర్ట్ చేసింది. మరి దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి..!!