టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ సైతం అతిథి పాత్ర పోషిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే సల్మాన్ తో సినిమా మొదలైనప్పటి నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మ సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజా స్పందించింది.
ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నట్లు వెల్లడించింది..ఆయనతో తాను ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించింది. “డేటింగ్ రూమర్ల గురించి నేను ఏమి చెప్పగలను? నా గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను చదువుతూ ఉంటాను. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతాను. నేను ప్రస్తుతం నా కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నాను. ఈ పుకార్ల గురించి స్పందించేందుకు ఏమీ లేదు” అని పూజా వెల్లడించింది..!!